
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా షూటింగ్ ప్రారంభమైన నాటినుండీ వార్తలలో నిలుస్తుంది. సినిమా రంగంలో వున్న పెద్ద పెద్ద తారలు సైతం ఈ సినిమాలో చిన్న పాత్రైనా పోషించడానికి ఆశపడుతున్నారు.
అయితే రాజమౌళి సినిమాలకు ఎక్కువగా పనిచేసే ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ మాత్రం ఈ సినిమా అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడు. దీనివెనుక బలమైన కారణం కూడా వుందంట. రాజమౌళి ఏకంగా నాలుగేళ్ళకు రవీందర్ డేట్ లు అడిగాడట.
ఈ గ్యాప్ లో రవీంద్ర 7 సినిమాలు చేశాడు. అందులో సన్నాఫ్ సత్యమూర్తి ఒకటి. ఈ సినిమా రేపు విడుదలకానుంది.