
ఈ మధ్య కాలంలో తెలుగమ్మాయిలకి మన ఇండస్ట్రీలోనే సరైన అవకాశాలు రావడం లేదు అని చెబుతూ ఉంటారు. కానీ ఈ మాటలకి నేను మాత్రం వ్యతిరేఖం అని ‘ఈ రోజుల్లో’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేష్మ రాథోర్ అంటోంది. ఈమె కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా నిరూపించుకుంటోంది. ఇప్పటికే తెలుగులో మూడు సినిమాలు సెట్స్ పై ఉంటే మరి రెండు హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇదివరకే తెలియజేసాము.
తాజా సమాచారం ప్రకారం రేష్మ రాథోర్ కోలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకోవడానికి సిద్దమైంది. రేష్మ రాథోర్ తమిళంలో రెండు సినిమాలకు సైన్ చేసింది. అందులో మొదటి సినిమా టైటిల్ ‘అదకపట్ట తోమగాజనాన్గలే’. తమిళంలో ఫేమస్ అయిన తంబి రామయ్య కుమారుడు ఉమాపతి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి శేఖర్ డైరెక్టర్. అక్టోబర్ 4నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇది కాకుండా మరో న్యూ డైరెక్టర్ తో కూడా ఓ సినిమాకి సైన్ చేసింది. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. తెలుగులో తన టాలెంట్ నిరూపించుకున్న రేష్మ రాథోర్ కోలీవుడ్ లో కూడా తన టాలెంట్ నిరూపించుకోవాలని ఆశిద్దాం..