దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా రాబోతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ఐతే, తాజాగా అజయ్ భూపతి “ఈ కొత్త సంవత్సరం మరింత పెద్దదిగా, మరింత మెరుగైనదిగా, ధైర్యవంతమైనదిగా ఉండబోతోంది’ అంటూ పోస్ట్ చేశారు. అలాగే, ‘ఇంటెన్స్ లవ్ టేల్’గా తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ థీమ్ మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేస్తూ 2026 జనవరి 1న జయకృష్ణ ఘట్టమనేని ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
కాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. తర్వాత షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది. అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. కాగా తిరుపతి నేపథ్యంలో హిందూ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. విష్ణువు స్వయంభుగా అవతరించిన ఈ క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథా నేపథ్యం సాగుతుందని.. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.
This NEW YEAR is gonna get Bigger, Better and Braver ❤️????
Here's the Theme Motion Poster of our INTENSE LOVE TALE #SrinivasaMangapuram ????
Revealing a riveting First Look of #JayaKrishnaGhattamaneni on January 1st 2026 ????
An @DirAjayBhupathi Film ????#RashaThadani @gvprakash… pic.twitter.com/YpiSU8XFGW
— Ajay Bhupathi (@DirAjayBhupathi) December 29, 2025
