కీర్తి సురేష్ ‘రివాల్వర్ రీటా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ !

Revolver Rita 1

కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటించిన సినిమా ‘రివాల్వర్ రీటా’. జే.కే చంద్రు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రాబోతోంది. డిసెంబర్ 26, 2025 నుండి ఈ చిత్రం ఆ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తమిళ మరియు తెలుగు వెర్షన్లతో పాటు, మలయాళం మరియు కన్నడ వెర్షన్లు కూడా అందుబాటులో రానున్నాయి.

కాగా ఈ సినిమాలో రాధిక శరత్‌ కుమార్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. ‘రివాల్వర్ రీటా’ చిత్రాన్ని ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం (మహారాజ నిర్మాత), జగదీష్ పళనిస్వామి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులని హాస్య మూవీస్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా దక్కించుకుని రిలీజ్ చేశారు. మరి కీర్తి సురేష్ సినిమా ఓటీటీలో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.

Exit mobile version