‘పిల్లా నువ్వులేని జీవితం’ సక్సెస్ ‘రేయ్’కి హెల్ప్ అవుతుందా.?

Rey-New-Posters-1
మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మరో హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ మొదటి సినిమాగా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మన్స్ కి మంచి రెస్పాన్స్ రావడం మరియు ప్రేక్షకుల నుంచి సినిమాకి హిట్ టాక్ రావడంతో మెగా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు.

కానీ ఈ సినిమా రిజల్ట్ వల్ల మరొక వ్యక్తి కూడా హ్యాపీగా ఉన్నాడు, అతనే డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. చెప్పాలంటే వైవిఎస్ చౌదరి సాయితో మొదటి సినిమా ‘రేయ్’ చేసాడు. కానీ ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల ఆ సినిమా గత సంవత్సర కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక్కడ వైవిఎస్ కి హ్యాపీనిచ్చే విషయం ఏమిటంటే పిల్లా నువ్వులేని జీవితం సక్సెస్ అవడంతో ఈ సినిమా ఫైనాన్సియర్స్, బయ్యర్స్ ‘రేయ్’ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. రేయ్ తో కూడా మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ఓ వార్త వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version