అక్కడ ఎఫైరే ఇక్కడ మొగలిపువ్వా?

mogalipuvvu
బాలీవుడ్ బాబు సచిన్‌ కథానాయకుడిగా రామ్‌గోపాల్‌ వర్మ హిందీలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. భార్యాభర్తల మధ్య బంధం గురించి తెరకెక్కుతున్న ఆ చిత్రానికి ‘ఎఫైర్‌’ అనే పేరు వర్కింగ్ టైటిల్ గా వినిపిస్తుంది. పెళ్లి తరువాత ప్రతీ మగాడికీ ఓ ఎఫైర్‌ ఉంటుందనే అంశంతో ఆ చిత్రం తెరకెక్కుతున్నట్టు సమాచారం. అయితే అదే సినిమాని తెలుగులో ‘మొగలిపువ్వు’ పేరుతో విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది.

రామ్‌గోపాల్‌ వర్మ కార్యాలయం నుంచి ఆ సినిమా వివరాల్ని ఇటీవలే ప్రకటించారు. అయితే నటీనటులు ఎవరన్నది మాత్రం అందులో చెప్పలేదు. ఇంటర్నెట్‌లో మాత్రం ఈ ‘మొగలిపువ్వు’ సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్లు షేర్ అవుతున్నాయి. “భర్త ఫోన్ లో భార్యకు తెలియని చాలా విషయాలు వుంటాయన్నది” దీని ట్యాగ్ లైన్. సమాచారం ప్రకారం హిందీలో తెరకెక్కుతున్న ఎఫైర్‌నే ఇక్కడ ‘మొగలిపువ్వు’గా విడుదల విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పేరును కూడా కాపీ కొట్టానని వర్మ ట్వీట్‌ చేశాడు. ఈ సినిమా కోసం వర్మ సుధీర్ఘకాలం తర్వాత విదేశాలకు వెళ్లి చిత్రీకరణ జరుపుకున్న సంగతి తెలిసినదే.

Exit mobile version