
టాక్ ఆఫ్ ది టౌన్ ని టాక్ ఆఫ్ ది ట్విట్టర్ గా మార్చడంలో, ట్విట్టర్ టాక్ ని టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చడం వర్మకి కీ ప్యాడ్ తో పెట్టిన విద్య. తనకి ఏదైనా విషయం ఇంటరెస్టింగ్ గా అనిపిస్తే దాని గురించి వరసపెట్టి వరదలా ట్వీట్స్ పొంగిస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ.ఇటీవలే బాహుబలి సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడంతో దానిపై వర్మ తనదైన స్టైల్ లో ట్వీట్ లు వేశాడు
అయితే సినిమాను దారుణంగా ఆకాశానికి ఎత్తేస్తూ ఇప్పటిదాకా వేసిన ట్వీట్ లు ఒకెత్తు అయితే పవన్, మహేష్, ఎన్టిఆర్ ని కలుపుతూ బాహుబలి గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ”ప్రతీ డంబ్ అభిమానికి తెలియాల్సిన విషయం ఏంటంటే.. పవర్ స్టార్, రెబెల్ స్టార్, సూపర్ స్టార్ కన్నా సినిమా అనేది చాలా పెద్దది. అసలు పాయింట్ ఏంటంటే, బాహుబలి అనే పాయింట్ పవన్, మహేష్, తారక్ తెలుస్కోకపోతే ఇక వారికిక పాయింట్ ఏమి వుండదు” అంటూ కామెంట్ చేసాడు వర్మ. అంతేకాక బడా స్టార్ లకి ఈ సినిమా అంటే కుళ్ళు అని, అందుకనే ప్రచారం చెయ్యలేదని తెలపడం విశేషం.