
ఎప్పటికప్పుడు వివాదాలతో సావాసం చేస్తూ, ఆ వివాదాలను ఎంజాయ్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాదు, వివాదాస్పద కథలతో కూడా సినిమాలు చేస్తాడు. అలా వివాదాస్పద నేపథ్యంలో ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.! రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కొన్నేళ్ళ పాటు వణికించిన డేంజరస్ క్రిమినల్ వీరప్పన్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథగా ‘కిల్లింగ్ వీరప్పన్’ రూపొందుతోంది. కర్ణాటకలోని అటవీ ప్రాంతంతో పాటు, వైజాగ్ లోని ఫారెస్ట్ ఏరియాలో ఈ సినిమాని షూట్ చేసారు.
తాజగా ఈ చిత్ర టీం షూటింగ్ మొత్తాన్ని ఫినిష్ చేసింది. అంతే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా ఫినిష్ చేసింది. దాంతో వర్మ ఈ సినిమా రిలీజ్ కి నవంబర్ ని టార్గెట్ చేసాడు. అక్టోబర్ 3వ వారంలో ఆడియోని రిలీజ్ చేసి నవంబర్ మొదటి వారంలో ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. వీరప్పన్‌గా సందీప్ భరద్వాజ్ అనే ఓ థియేటర్ ఆర్టిస్ట్ కనిపించనుంటే, అతన్ని చంపిన పోలీస్ ఆఫీసర్ గా శివరాజ్ కుమార్ కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది.