
ఇప్పటి వరకూ వయోలెంట్ సినిమాలు, హర్రర్ సినిమాలు, యాక్షన్ ధ్రిల్లర్లు చూసి ప్రేక్షకులను మెప్పించిన రామ్ గోపాల్ వర్మ తన కెరీర్లో మొదటి సారి ఓ రొమాంటిక్ లవ్ స్టొరీగా చేసిన సినిమా ‘365 డేస్’. నేటి తరం ప్రేమలు ఎలా ఉన్నాయి, ప్రేమకు ముందు ఒక జంట ఎలా ఉంటోంది – పెళ్లి తర్వాత అదే ప్రేమ జంట ఎలా ఉంటోంది అనే పాయింట్ ని బేస్ చేసుకొని చేసిన సినిమానే ‘365 డేస్’. ఇటీవలే ఈ సినిమా ఆడియోని కూడా విడుదల చేసారు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. నిఖిత శ్రీ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేష్ విలక్షణ – రామ్ గోపాల్ వర్మ కలిసి ఈ సినిమాని నిర్మించారు. నందు,అనైక సోతి జంటగా నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ తెచ్చుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో అన్నా రామ్ గోపాల్ వర్మ మళ్ళీ విజయాన్ని అందుకుంటాడు ఏమో చూడాలి..