లవ కుశ లలో రిచా పనై ఎవరితో రొమాన్స్ చేయనుంది?

లవ కుశ లలో రిచా పనై ఎవరితో రొమాన్స్ చేయనుంది?

Published on Jun 15, 2014 4:03 AM IST

Richa-Panai
తన మొదటి సినిమా ‘యముడు కి మొగుడు’ లో సొంత డబ్బింగ్ చెప్పుకోడానికి చాలా కృషి చేసిన అందమైన పొడుగు అమ్మాయి రిచా పనైని.ఎంతో కష్టపడి పని చేసే ఈమెకి చాలా వ్యవది తరువాత ‘చందమామ కథలు’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో తన బాయ్ ఫ్రెండ్ ని మోసం చేసి ఒక డబ్బున్న అరబ్ షేక్ ని పెళ్లి చేసుకుని తన చేతిలో తన కుటుంబం చేతిలో మోసపోయే ఒక ముస్లిం యువతి పాత్ర పోషించింది. ఒక గ్లామరస్ పాత్ర తో పాటు నటనకు ఆస్కారం వున్న పాత్ర పోషించిన రిచా ఇప్పుడు వరుణ్ సందేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్న లవకుశ చిత్రం లో ఒక పల్లెటూరి యువతి పాత్ర పోషించడానికి సిద్దం అయ్యింది.

ఈ చిత్రంలో ఒక వరుణ్ సందేశ్ పాత్రకి జతగా నటించనుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. రిచా ప్రస్తుతం చిన్న హాలిడే కోసం ముంబై వెళ్ళింది.
కొన్ని రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గోనున్నటు తెలిపింది. “నాకు ఒక్కడే అన్నయ్య తన పెళ్లి జరగనుంది నాకు మిస్ అవ్వాలని లేదు. కాని నాకు లవకుశ లో పని చేయడం చాలా ఆనందంగా వుంది. నాకు పల్లెటూరి యువతి పాత్ర చేయడం చాలా ఇష్టం. భారతీయ సాంప్రదాయ దుస్తులు నాకు బాగా నప్పుతాయి. ముఖ్యంగా లంగా వోణి. వరుణ్ సందేశ్ తో కలసిపనిచేయడానికి ఎదురుచూస్తున్న.” అని రిచా తెలిపింది. ఈ చిత్రంలో ఇంకో హీరోయిన్ గా కొత్త అమ్మాయి నటించనుంది.

తాజా వార్తలు