1990ల నాటి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంతో, యదార్థ గాథల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘రిమ్‌జిమ్’. ‘అస్లీదమ్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఏవీ సినిమాస్, సి విజువల్స్ బ్యానర్లపై జి. సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్నేహం, ప్రేమ, గ్యాంగ్‌స్టర్ డ్రామా అంశాలతో దర్శకుడు హేమ సుందర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో ఆస్కార్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఒక కీలక పాత్రలో నటించడమే కాకుండా, రెండు పాటలు కూడా పాడారు. ఇవి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అజయ్ వేద్ హీరోగా, వ్రజన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సినిమా అవుట్‌పుట్ పట్ల దర్శకుడు హేమ సుందర్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. వాసు పెండం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కొక్కిలగడ్డ ఇఫ్రాయిం సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
