ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రానున్న పలు అవైటెడ్ సీక్వెల్ చిత్రాల్లో సూపర్ హీరో జానర్ చిత్రం “జై హనుమాన్” కూడా ఒకటి. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ అవైటెడ్ సీక్వెల్ లో రిషబ్ శెట్టి మెయిన్ హీరోగా తేజ సజ్జ లిమిటెడ్ స్క్రీన్ టైం తో మరో హీరోగా తాను కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇంకా చాలా పూర్తి చేసుకోవాల్సి ఉండగా ఈ చిత్రం కోసం రిషబ్ అందుకుంటున్న రెమ్యునరేషన్ కోసం షాకింగ్ రూమర్ ఇప్పుడు వైరల్ గా వినిపిస్తుంది.
జై హనుమాన్ లో రిషబ్ చేస్తున్న హనుమాన్ పాత్రకి గాను ఏకంగా 80 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారని ఇపుడు వినిపిస్తుంది. దీనితో కన్నడ నుంచి తెలుగులో సినిమా చేస్తూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా తాను నిలిచారని చెప్పొచ్చు. కానీ ఇందులో ఎంతమేరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


