వొకేషన్ కోసం న్యూయార్క్ కు వెళ్ళిన సూపర్ స్టార్ !

Rajinikanth1
బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్ లతో అలిసిపోయిన సూపర్ స్టార్ రజినీకాంత్ విశ్రాంతి కోసం న్యూయార్క్ వెళ్లారు. ఆయన న్యూ ఇయర్ కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకొని జనవరి ఫస్ట్ వీక్ లో మళ్ళీ ఇండియా రానున్నారు. ఇక కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజినీ నటించిన తాజా చిత్రం ‘పేట’ విడుదలకు సిద్ధమైంది.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పొంగల్ కానుకగా జనవరి 10న విడుదలకానుందని సమాచారం. ఈ చిత్రం తరువాత రజినీ ,మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు వున్నాయి. ఇక రజినీ ఈ చిత్రం తరువాత నటనకు స్వస్తి చెప్పే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Exit mobile version