ముగ్గురుతో రొమాన్స్ చేయడం కష్టమంటున్న యంగ్ హీరో

harshavardhan-rane
‘తకిట తకిట’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘అనామిక’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యంగ్ హీరో హర్షవర్ధన్ రాణే. హర్షవర్ధన్ హీరోగా నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మాయ’. ఈ సినిమాలో హర్షవర్ధన్ సరసన అవంతిక, సుష్మ, నందిని రాయ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇలా ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం చాలా కష్టం అని హర్షవర్ధన్ అంటున్నాడు. ‘ముగ్గురితో రొమాన్స్ చేయాలి అన్నప్పుడు డిఫరెంట్ ఎమోషన్స్ లో అందరితోనూ సమానంగా రొమాన్స్ చేయాలి. ఈ విధమైన పాత్రలో నేను ఎప్పుడూ నటించలేదు. ఒక సినిమాలో ముగ్గురుతో రొమాన్స్ చయడం అనేది చాలా కష్టం అని’ హర్షవర్ధన్ అంటున్నాడు.

అలాగే డైరెక్టర్ నీలకంఠ గురించి చెబుతూ ‘నీలకంఠ బాగా క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్. ఒక నటుడు చెప్పే విషయాలను ఎప్పుడు లెక్కలోకి తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు అనేది బాగా తెలుసని’ అన్నాడు. మాయ సినిమా అందరినీ మెప్పించి హర్ష వర్ధన్ రాణే, నీలకంఠకి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి..

Exit mobile version