డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ కొడుకు ఆకాశ్ పూరి, కేతికా శర్మజంటగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్. అనిల్ పాదూరి దర్శకుడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.కాగా నేడు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. హీరో ఆకాశ్, హీరోయిన్ కేతికా శర్మను కౌగిలించుకున్న స్టిల్‌ను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. ఈ హీరోయిన్ కేతిక టాప్ లెస్ గా హీరోని కౌగిలించుకోవడం గమనార్హం. ఘాడమైన ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయిన జంటగా వీరిద్దరూ కనిపిస్తున్నారు. పూరి హిట్ చిత్రాలైన ఇడియట్, 143 లాగా ఇంటెన్సిటీ తో సాగే లవ్ స్టోరీ గా రొమాంటిక్ చిత్రంగా అనిపిస్తుంది.
ఇప్పటికే సినిమా హైదరాబాద్, గోవా షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. సోమవారం నుండి కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోనే ప్రారంభం కానుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేశ్ సినిమాటోగ్రఫీని అందించారు.
