సమీక్ష : రోషగాడు – స్లోగా సాగే పోలీస్ డ్రామా

విడుదల తేదీ : నవంబర్ 16, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : విజయ్ ఆంటొని , నివేత పేతురాజ్ , డానియల్ బాలాజీ

దర్శకత్వం : గణేషా

నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటొని

సంగీతం : విజయ్ ఆంటొని

ఛాయాగ్రహణం : రిచర్డ్ నాథన్

‘బిచ్చగాడు’ చిత్రం తో తెలుగు లో మంచి గుర్తింపును తెచ్చుకున్నతమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం’ రోషగాడు’. మరి ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

 

కథ :

పోలీస్ కానిస్టేబుల్ అయిన కుమార స్వామి (విజయ్ ఆంటొని ) తన తమ్ముడు రవి ని ఎలాగైనా ఇన్స్పెక్టర్ ను చేయాలనీ అనుకుంటాడు కానీ చదువు అంటే ఏం మాత్రం ఇష్టముండని రవి హైదరాబాద్ పారిపోయి అక్కడి రౌడీ (బాబ్జి ) దగ్గర చేరి హత్యలు చేస్తుంటాడు. రెండు సంవత్సరాల తరువాత ఇన్స్పెక్టర్ గా హైదరాబాద్ కు బదిలీ మీద వచ్చిన కుమార స్వామి కి తన తమ్ముడు కలవడం అతను చేసే హత్యల గురుంచి తెలుసుకొని ఎన్కౌంటర్ లో రవిని చంపేస్తాడు కుమార స్వామి. కానీ తన తమ్ముడులాగే మరి కొంత మంది పిల్లలు కూడా బాబ్జి కోసం పనిచేస్తున్నారని తెలుసుకొని కుమార్ స్వామి వారందరిని మార్చాలనుకుంటాడు. ఈ క్రమంలో కుమార స్వామి అనుకున్నది చేయగలిగాడు ? ఇంతకీ బాబ్జి ఎవరు ? అనేదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచింది కుమార స్వామి పాత్ర. ఇక ఆ పాత్రలో నటించిన విజయ్ ఆంటొని తన సెటిల్డ్ పెర్ ఫార్మన్స్ తో మెప్పించాడు. సీరియస్ గా వుంటూ ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి నటన ను కనబర్చాడు. ఇక విజయ్ కి సపోర్ట్ చేసే పాత్రలో నటించిన హీరోయిన్ నివేత పేతురాజ్ లుక్స్ పరంగా ఆకట్టుకొని తన ఎనర్జిటిక్ నటన తో మెప్పించింది.

ఇక విలన్ పాత్రలో నటించిన డానియల్ బాలాజీ తన పాత్ర కు పూర్తి న్యాయం చేశాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చేఎమోషనల్ సన్నివేశాలు తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు గణేశా మంచి మెసేజ్ వున్న స్టోరీ ని ఎంచుకున్న దాన్ని తెర మీద తీసుకురావడంలో చాలా చోట్ల తడబడ్డాడు. ముఖ్యంగా స్లో నరేషన్ తో విసిగించాడు. దాంతో ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది కానీ ఇంటర్వెల్ లో ఒక చిన్న ట్విస్ట్ తో సినిమా ఫై ఆసక్తిని క్రియేట్ చేయడంలో సఫలమైన తరువాత అదే మ్యాజిక్ ని కొనసాగించలేకపోయాడు.

ఇక సినిమా మొత్తం తమిళ్ ఫ్లేవర్ లో ఉండడం కొన్ని చోట్ల హద్దులు దాటడం వంటి అంశాలు కూడా తెలుగు ప్రేక్షకులకు రుచించవు. సంగీతం కూడా సినిమాకు మైనస్ అయ్యింది.

సాంకేతిక వర్గం :

గణేషా తీసుకున్న స్టోరీ లైన్ బాగున్న దాన్ని సినిమా గా మలచడంలో అంతగా విజయం సాధించలేకపోయాడు. డల్ నరేషన్ , ఆసక్తిలేని ములుపులు ఎంటెర్టైనెంట్అస్సలు లేకపోవడం వంటి అంశాలతో దర్శకుడు సినిమాను సాదా సీదాగా మార్చేశాడు. ఫలితంగా ఈ చిత్రం బీలో యావరేజ్ చిత్రంగానే మిగిలిపోయింది.

ఇక ఈచిత్రానికి సంగీతం మరియు ఎడిటింగ్ అందించిన హీరో విజయ్ ఆంటొని రెండింటిలోనూ సత్తా చాటలేకపోయాడు. ఉన్నవి మూడు పాటలే అయినా దాంట్లో ఏ ఒక్కటి గుర్తిండిపోవు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమా చాల చోట్ల ట్రిమ్ చేస్తే బాగుండేదని అనిపిస్తుంది. రిచర్డ్ నాథన్ ఛాయాగ్రహణం బాగుంది. లో బడ్జెట్ సినిమా అయినా ఫాతిమా విజయ్ ఆంటొని నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

తీర్పు :

డిఫరెంట్ స్టోరీ తో ‘రోషగాడు’ గా ప్రేక్షకులముందుకు వచ్చిన విజయ్ ఆంటొని కి ఈచిత్రం మరో ‘బిచ్చగాడు’ అవ్వలేకపోయింది. డైరెక్షన్ లోపాలు అలాగే ఎంటెర్టైనెంట్ లేకపోవడం , స్లో నరేషన్ వల్ల ఈచిత్రం సాదా సీదాగా మిగిలిపోయింది.. అయితే విజయ్ సిన్సియర్ యాక్టింగ్ అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. చివరగా మాస్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ చిత్రం ఏ సెంటర్ల ప్రేక్షకులను మెప్పించలేకపోయిన బి,సి సెంటర్ల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అవకాశాలుఉన్నాయి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Advertising
Advertising