విడుదల తేదీ : డిసెంబర్ 13, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : రోషన్ కార్తీక్ కనకాల, సాక్షి మహాదోల్కార్, బండి సరోజ్ కుమార్, వైవా హర్ష తదితరులు
దర్శకుడు : సందీప్ రాజ్
నిర్మాణం : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీత దర్శకుడు : కాల భైరవ
సినిమాటోగ్రాఫర్ : రామ మూర్తి ఎం
ఎడిటర్ : కోదాటి పవన్ కళ్యాణ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో రోషన్ కనకాల అలాగే సోషల్ మీడియా సెన్సేషన్ బండి సరోజ్ లతో కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన సినిమా “మోగ్లీ 2025” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
పార్వతీపురం అనే ఒక కొండ ప్రాంతపు చిన్న గ్రామంలో మురళీ కృష్ణ అక్కడి ప్రజలు మోగ్లీ (రోషన్ కార్తీక్ కనకాల) గా పిలవబడే కుర్రాడు ఎప్పటికైనా పోలీస్ కావాలని కలలు కంటాడు. చిన్నతనంలోనే అమ్మానాన్నలని కోల్పోయిన తాను తన ఊరివారి లోనే తన కుటుంబాన్ని చూసుకుంటాడు. ఇదిలా ఉంటే ఆ ఊరిలో ఓ సినిమా షూటింగ్ కోసం వచ్చిన ఒక మూగ, చెవిటి అమ్మాయి వర్ష అలియాస్ జాస్మిన్ (సాక్షి) ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఇలా వీరి లవ్ ట్రాక్ లోకి స్త్రీ వ్యామోహం ఉన్న క్రూరమైన పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) వచ్చాక ఏమైంది? మోగ్లీ ఈ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? కోల్పోయింది ఏంటి? చివరికి తన ప్రేమ గెలిచిందా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో నలుగురు మెయిన్ పాత్రధారులు సాలిడ్ నటన కనబరిచారు అని చెప్పాలి. ముందుగా రోషన్ కార్తీక్ కనకాల విషయానికి వస్తే తాను ఈ సినిమాలో నటుడిగా చాలా చక్కని హావ భావాలు పలికించాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మోగ్లీ అనే అడవి కుర్రాడి పాత్రలో తాను ఇమిడిపోయాడు. ఆ పాత్రలోని ఒక అమాయకత్వాన్ని తన ముఖ కవళికలలో చాలా బాగా చూపించాడు. ఈ ఎమోషన్ మాత్రం రోషన్ లోని నటుడుని బాగా చూపించింది.
అలాగే యంగ్ హీరోయిన్ సాక్షి మహాదోల్కార్ కూడా బాగా చేసింది. తనకిచ్చిన ప్రత్యేక పాత్రలో ఆమె బాగా చేసింది. రోషన్ తో కూడా ఆమె కెమిస్ట్రీ బాగుంది. ఇక నటుడు పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. తన పాత్ర డిజైన్ గాని ఆ పాత్రలో తానే ఎందుకు అనే అంశం ఈ సినిమాలో తాను పర్ఫెక్ట్ గా చేసి చూపించారు. తనలో ఆల్రెడీ నెగిటివ్ షేడ్ చాలా మంది చూసి ఉండొచ్చు కానీ ఇందులో నెగిటివ్ షేడ్ కూడా సాలిడ్ గా వర్కౌట్ అయ్యింది. తన ఇంట్రో గాని సెకండాఫ్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి.
ఇక వీరి అందరితో పాటుగా వైవా హర్షకి మంచి రోల్ పడింది. అక్కడక్కడా కామెడీ సీన్స్ ఇంకా ఎమోషనల్ గా కూడా తనపై కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే తనపై ఫస్టాఫ్ లో ఓ సీక్వెన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి సర్ప్రైజింగ్ గా అనిపించవచ్చు. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు అంతా బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో మెయిన్ సమస్య ఎక్కడ వచ్చింది అంటే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ని బాగా సాగదీతగా తీసుకెళ్తూ చెప్పడం జరిగింది. హీరో, హీరోయిన్ ట్రాక్ లని అనవసరంగా సాగదీసినట్టుగా ఉంటుంది. మొదటి కొన్ని నిమిషాల ఎస్టాబ్లిష్మెంట్ డీసెంట్ గా అనిపిస్తుంది కానీ నెమ్మదిగా పరిస్థితులు ఇంట్రెస్ట్ లేకుండా చాలా రొటీన్ అండ్ సాగదీతగా వెళతాయి.
ఇక ఇదే పంథా సెకండాఫ్ లో కూడా సాగుతుంది. సెకండాఫ్ లో బండి సరోజ్ పై కొన్ని సీన్స్ బానే లాక్కొచ్చారు కానీ మిగతా సీన్స్ మాత్రం ఎప్పుడో చూసేసిన నిజం, నువ్వు నేను లాంటి తేజ సినిమాలను ఆడియెన్స్ కి గుర్తు చేసేలా కనిపిస్తాయి. అలాగే నటుడు సుహాస్ పోర్షన్ కూడా అంత కిక్ ఏమీ ఇందులో ఇవ్వలేదు. ఐకాన్ స్టార్ ని ఇమిటేట్ చేస్తూ ట్రై చేసిన పోర్షన్స్ నాచురల్ గా అనిపించలేదు.
అలాగే వీటితో పాటుగా రోషన్ ఇంకా తన నటనపై దృష్టి పెట్టాల్సి ఉంది. తనలోని ఇన్నోసెన్స్ ని చాలా బాగా చూపించిన తాను కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. దానివల్ల ఇంపాక్ట్ కొంచెం తగ్గింది. దీనిని తాను అధిగమిస్తే ఫ్యూచర్ లో తనలో మరింత మంచి నటుణ్ని చూడొచ్చు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. దాదాపు సినిమాని రియల్ లొకేషన్స్ లోనే చిత్రీకరించడం విశేషం. సీన్ టు సీన్ మంచి ట్రాన్సిక్షన్స్ ఫస్టాఫ్ లో కనిపిస్తాయి. వి ఎఫ్ ఎక్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. కాల భైరవ సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.
ఇక దర్శకుడు సందీప్ రాజ్ విషయానికి వస్తే.. తాను ఈ సినిమాకి కలర్ ఫోటో రేంజ్ లో ట్రీట్మెంట్ ఇద్దామనుకునే ప్రయత్నం చేశారు కానీ అందులో అంత ఇంపాక్ట్ కలిగించలేకపోయారు. ప్రధాన పాత్రలు నుంచి మంచి నటన అయితే తాను రాబట్టగలిగారు కానీ సినిమాలో మెయిన్ పాయింట్ కోసం మిగతా కథనం సాగదీతగా లాగుతూ తీసుకెళ్లారు. కొన్ని సీన్స్ ని తగ్గించి మరింత గ్రిప్పింగ్ గా కథనాన్ని డిజైన్ చేసుకోవాల్సింది అలాగే సెకండాఫ్ లో లీడ్ జంటపై సీన్స్ ని మరో వెర్షన్ ని ట్రై చేయాల్సింది అవన్నీ తేజ సినిమాల్లో చూసినట్టే ఉంటాయి సో కొత్తదనం మిస్ అయ్యింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘మోగ్లీ 2025’ లో రోషన్ ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ ని అందించాడు. తన పాత్రలోని ఇన్నోసెన్స్ ని చాలా బాగా ప్రదర్శించాడు. అలాగే బండి సరోజ్ కి కూడా మంచి రోల్ పడింది దానిని తాను కూడా బాగా పండించారు. కొన్ని కొన్ని సీన్స్ అక్కడక్కడా పర్వాలేదు అనిపిస్తాయి కానీ ఇంకా బలమైన కథనం, ఎమోషన్స్ ఇందులో అవసరం ఉంది. వీటిని కరెక్ట్ గా దర్శకుడు కుదిర్చి ఉంటే బాగుండు. సో ఈ చిత్రం కొంతమేర మాత్రమే ఓకే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
