యంగ్ హీరో నారా రోహిత్, విశాక సింగ్ జంటగా నటిస్తున్న ‘రౌడీ ఫెలో’ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 8న హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 13 వరకు షూటింగ్ కొనసాగుతుంది. హీరో హీరోయిన్లపై రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. టాకీ పార్ట్ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ‘రౌడీ ఫెలో’ యూనిట్ ఇటివలే అమెరికా(వాష్టింగ్టన్)లో ఒక పాటను షూట్ చేశారు.
కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాట రీమిక్స్ చేశారు. ‘భలే తమ్ముడు’లోని ‘ఎంతవారుగాని.. వేదాంతులైనాగాని.. వాలు చూపు తాకగానే’ పాటను ‘రౌడీ ఫెలో’ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సన్నీ సంగీతం అందించారు. మూవీమిల్స్ పతాకంపై ప్రకాష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
