యు ట్యూబ్ లో కూడా రిలీజ్ కానున్న ‘రౌడీ ఫెలో’

rowdyfellow
‘పురాణాలన్నీ ఈగో ప్రోబ్లమ్స్ అనమాట’ అనే డైలాగ్ వినగానే అందూ ఓ సారి పురాణాలను గుర్తుకు తెచ్చుకొని అవును కదా అని అనుకుంటాం… అదే డైలాగ్ ని కథా వస్తువుగా తీసుకొని చేసిన సినిమా ‘రౌడీ ఫెలో’. నారా రోహిత్ హీరోగా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ శుక్రవారం(నవంబర్ 21న) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. నారా రోహిత్ కాస్త టిపికల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో విశాఖ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది.

ఈ సినిమాని నవంబర్ 21న థియేటర్స్ వన్ కాకుండా యు ట్యూబ్ లో కూడా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేసింది. ఎక్కడైతే ఈ సినిమా రిలీజ్ కావడంలేదో అక్కడి తెలుగు వారు కొంత అమౌంట్ ఆన్ లైన్ పే చేసి ఈ సినిమాని చూడొచ్చు. ఇలా యు ట్యూబ్ ఈ సినిమా చూడటానికి కావాల్సిన ఏర్పాట్లు ముగిసాయి. రేపటి లోపు ఏ యు ట్యూబ్ పేజి లో మీకు సినిమా అందుబాటులో ఉంటుంది, లాగే దాని ఖరీదు ఎంత అనే విషయాలను అధికారికంగా తెలియజేస్తారు.

లిరిసిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని ప్రకాష్ రెడ్డి నిర్మించాడు. సన్నీ ఎంఆర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘భలే తమ్ముడు’లోని ‘ఎంతవారుగాని.. వేదాంతులైనాగాని.. వాలు చూపు తాకగానే’ పాటను రీమిక్స్ చేసారు.

Exit mobile version