ఓటిటి సమీక్ష: ‘గమ్యం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘గమ్యం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Published on Aug 17, 2026 2:17 PM IST

Gamyam Review

ఓటీటీ వేదిక : ఈటీవీ విన్

ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : 16 ఆగస్టు, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ 2.75/5

నటీనటులు : నవీన్ వోలేటి, శ్రీనివాస్ చిలుకూరి, మైత్రేయి, ఆర్య అర్జున్
దర్శకత్వం : ఆర్పీ పట్నాయక్
నిర్మాణం : రఘురాం, గీత
సంగీతం : ఆర్పీ పట్నాయక్
ఛాయాగ్రహణం : లోకేష్ రెడ్డి
కూర్పు : వేణు, నాని

సంబంధిత లింక్స్ : ట్రైలర్

తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘గమ్యం’. ఆర్పీ పట్నాయక్ తెరకెక్కించిన ఈ లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

యూఎస్ లోని డాలస్ లో క్యాబ్ డ్రైవర్ గా పని చేసే రవి (శ్రీనివాస్ చిలుకూరి) కి ఒక రోజు బిజినెస్ మెన్ మధుకర్ (నవీన్ వోలేటి) తో పికప్ డ్రాప్ వస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరి మాటల్లో ఒకరి కోసం ఒకరు కొంచెం తెలుసుకుంటారు. కానీ తన గమ్యాన్ని చేరే లోపే మధుకర్ కి జరిగిన ఊహించని ఘటనతో రవి ప్రశ్నలో పడతాడు. దీనితో అక్కడ నుంచి రవి ఏం చేసాడు అనేది అసలు కథ.

ప్లస్ పాయింట్స్:

కథా సుధలో ఆర్పీ పట్నాయక్ నుంచి ఇది మరో లఘు చిత్రం కాగా దీనిని కూడా యూఎస్ బ్యాక్ డ్రాప్ లోనే ప్లాన్ చేయడం ఇంట్రెస్టింగ్. అయితే అక్కడ నేపథ్యంలో కూడా క్లీన్ సెటప్ తో దీనిని తెరకెక్కించారు. ముఖ్యంగా 2000 ల సమయంలో కనిపించిన ప్రముఖ నటుడు నవీన్ వోలేటిని చాన్నాళ్ళకి చూపించారు.

తన పాత్ర బ్యాక్ స్టోరీ కూడా ఇందులో డీసెంట్ గా ఉంది. అలాగే యువ నటుడు శ్రీనివాస్ చిలుకూరి కూడా ఇందులో బాగా చేశారు. ఇద్దరి నడుమ కథనం మధ్యలో వచ్చే కాంఫ్లిక్ట్, ఆ తర్వాత కథనం కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటుల పెర్ఫామెన్స్ లు కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు ఆర్ఫీ పట్నాయక్ దాదాపు కథనం నీట్ గానే నడిపించారు కానీ నవీన్ వోలేటి బ్యాక్ స్టోరీలో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. తన భార్యతో ట్రాక్ ఇంకొంచెం మెరుగ్గా ప్లాన్ చేసుకోవాల్సింది. అలాగే కోర్ కాన్సెప్ట్, చివరి కొన్ని నిమిషాలు రొటీన్ గానే ఉంటాయి.

సాంకేతిక వర్గం:

ఇందులో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆర్పీ పట్నాయక్ సంగీతం బాగుంది. తన వాయిస్ లో చిన్న బిట్ సాంగ్ కూడా ఓకే. కెమెరా వర్క్, ఎడిటింగ్ కూడా బాగానే ఉన్నాయి. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం విషయానికి వస్తే.. తాను తీసుకున్న సింపుల్ కాన్సెప్ట్ ని అక్కడక్కడా గానే నడిపించారు. సో తన వర్క్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూస్తే.. ఈ ‘గమ్యం’ అనే లఘు చిత్రంలో ఆర్పీ పట్నాయక్ వర్క్ దర్శకునిగా, సంగీత దర్శకునిగా కూడా బాగానే అనిపిస్తాయి. నటీనటుల పెర్ఫామెన్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. అయితే ఇంకొన్ని సీన్స్ లో కథనం బెటర్ గా ఉండాల్సింది. ఇవి పక్కన పెడితే ఈ లఘు చిత్రం ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

తాజా వార్తలు