‘ఆర్ఆర్ఆర్’ సెన్సేషన్ : ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి నామినేషన్


దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఇటీవల తెరకెక్కిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. ఇక ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ విడుదల తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప సంచలన విజయం నమోదు చేయడంతో పాటు, హాలీవుడ్ సహా ఎన్నో భాషల ఆడియన్స్, అలానే సినీ ప్రముఖుల ప్రసంశలు దక్కించుకుంది. ఇక ఇప్పటికే కొన్ని విదేశీ అవార్డ్స్ కొల్లగొట్టి ఇండియన్ సినిమా రేంజ్ ని ఎంతో పెంచిన ఆర్ఆర్ఆర్ కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి వచ్చి చేరిందనే చెప్పాలి.

ప్రపంచ ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాల క్యాటగిరి విభాగంలో బెస్ట్ పిక్చర్స్ గా మొత్తం ఐదు సినిమాలు నిలవగా అందులో ఆర్ఆర్ఆర్ కూడా ఒక నామినేషన్ ని, అలానే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు సాంగ్ కూడా నామినేషన్ లిస్ట్ లో నిలిచింది. ఒకరకంగా ఆర్ఆర్ఆర్ మూవీకి ఈ ఖ్యాతి దక్కడం ఎంతో గొప్ప విశేషం అని, అలానే దీనిని బట్టి చూస్తే ఆర్ఆర్ఆర్ మూవీ రాబోయే రోజుల్లో ఆస్కార్ కి నామినేట్ అయి, ఆపైన అవార్డులు దక్కించుకునే అవకాశం కూడా కనబడుతోందని అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు. మరి రాబోయే రాబోయే రోజుల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ఇంకెన్ని సంచలన అవార్డులు అందుకుంటుందో చూడా

Exit mobile version