లాక్ డౌన్ కారణంగా షూట్ ఆలస్యం అయినందున 2021 జనవరి 8వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని విడుదల చేయడం లేదని నిన్న ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య స్పష్టంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం 2021 వేసవిలో విడుదల కానుంది. రాజమౌళి ఆయన టీం ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ విడుదల తేదీల గురించి చర్చించడంలో బిజీగా ఉన్నారు.
ఏప్రిల్ 28 తేదీన రిలీజ్ చేసే ఆలోచన ఉన్నారట. అయితే మే నెలలో రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్రబృందంలో కొంతమంది అభిప్రాయ పడుతున్నారట. ఏమైనా ఏప్రిల్ నుండి జూన్ మొదటి వారం వరకు చూస్తే.. సినిమా రిలీజ్ కి అనువుగా మూడు కీలకమైన ఉన్నాయట. మరి రాజమౌళి ఏ నెలను ఎంచుకుంటారో చూడాలి.
డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
