
తెలుగు జాతి ప్రజలకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఎంతో సమర్ధవంతంగా పరిపాలించిన కాకతీయ వంశీయులలో వీరణారిగా పేరు తెచ్చుకున్న రుద్రమదేవి జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రుద్రమదేవి’. ఫస్ట్ ఇండియన్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ ఫిల్మ్ గా వస్తున్న ఈ ‘రుద్రమదేవి’ టైటిల్ రోల్ లో అనుష్క నటించింది. భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటి వరకూ ఈ చిత్ర టీం రుద్రమదేవి సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చెయ్యాలని ముందు నుంచే ప్లాన్ చేసారు. కానీ తాజాగా ఈ చిత్ర టీం రుద్రమదేవి సినిమాని మలయాళంలో కూడా ఒకేసారి రిలేజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు,. అందులో భాగంగానే మలయాళ వెర్షన్ కి సంబందించిన డబ్బింగ్ వర్క్ ని కూడా శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. బాహుబలి సినిమాతో అనుష్కకి, అలాగే అక్కడ అల్లు అర్జున్ కి మంచి పేరు ఉండడంతో ఈ సినిమాని అక్కడ కూడా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు.
3డి గ్లాసెస్ లేకుండా 3డి ఫార్మాట్ లో ఈ సినిమాని ప్రేక్షకులకు చూపించేలా గుణశేఖర్ వర్క్ చేస్తున్నాడు. ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, రానా, నిత్యా మీనన్, కేథరిన్ ట్రేస, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, హంసా నందినిలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

