ఓరుగల్లు ఘనతను చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’. అనుష్క ‘రుద్రమదేవి’ పాత్రలో నటిస్తున్నారు. గుణ టీం వర్క్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రచార చిత్రాలు, నటీనటుల ఆహార్యం సినిమాపై అంచనాలను పెంచాయి.
సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి నెలలో విడుదల చేయాలని భావించినా, నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకనిర్మాత గుణశేఖర్ తెలిపారు.
అనుష్క జోడిగా చాళుక్య వీరబద్రుడి పాత్రలో దగ్గుబాటి రానా నటించగా, కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. కృష్ణం రాజు, సుమన్, ప్రకాశ్ రాజ్, నిత్యా మీనన్, క్యాథరిన్, ప్రభు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా ఈ చారిత్రాత్మక చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇండియాలో తెరకెక్కుతున్న ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి సినిమా ఇది.
