అతి త్వరలో రానున్న ‘రుద్రమదేవి’ ట్రైలర్

Rudhramadevi

అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’. అనుష్క జోడిగా చాళుక్య వీరబద్రుడి పాత్రలో దగ్గుబాటి రానా నటించగా, కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. కొంత సమయం నుంచి ఈ సినిమా ట్రైలర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ గుణ టీం వర్క్స్ వారు చెప్పిన తాజా సమాచారం ప్రకారం రుద్రమదేవి ట్రైలర్ ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడం లేదు. కానీ అతి త్వరలోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం, ట్రైలర్ రిలీజ్ డేట్ ని కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని వారు తెలియజేశారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన అనుష్క గెటప్, మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి.

కృష్ణం రాజు, సుమన్, ప్రకాశ్‌ రాజ్, నిత్యా మీనన్, క్యాథరిన్, ప్రభు తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను గుణ టీం వర్క్స్ పతాకంపై గుణశేఖర్ నిర్మిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా ఈ చారిత్రాత్మక చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇండియాలో తెరకెక్కుతున్న ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి సినిమా ఇది.

Exit mobile version