ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో తన కెరీర్ 111 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా షూట్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుండగా ఈ ప్రాజెక్ట్ ఓటిటి డీల్ కి సంబంధించి లేటెస్ట్ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ఓ ప్రముఖ ఓటిటి సంస్థ పెద్ద మొత్తంలోనే ఆఫర్ ని అందించినట్టు టాక్. బాలయ్య గత సినిమాలు హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజాలు తీసుకుంటే ఈసారి జీ 5 సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఫ్యాన్సీ డీల్ అందించేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది.
రేటు కూడా 50 కోట్లకి తగ్గకపోవచ్చని లేటెస్ట్ బజ్.. సో ఈ రూమర్స్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా కాజల్ అగర్వాల్ ఓ సీరియస్ రోల్ లో నటిస్తుంది. అలాగే పెద్ది నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.
