లోకేష్-బన్నీ మూవీపై రూమర్స్.. ఛాన్సే లేదంటున్న ఫ్యాన్స్..!

AA23

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘AA23’ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ థీమ్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, కాస్టింగ్ ప్రాసెస్ శరవేగంగా జరుగుతున్నాయి. లోకేష్ కనగరాజ్ లైన్‌కు అల్లు అర్జున్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఫైనల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో చిత్ర యూనిట్ నిమగ్నమై ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా పనులు పక్కా ప్లానింగ్‌తో సరైన ట్రాక్‌లోనే సాగుతున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది లోపు ఆ సినిమాను పూర్తి చేసి మేకర్స్ వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఆ వెంటనే, లోకేష్ సినిమాను పట్టాలెక్కించి వేగంగా షూటింగ్ పూర్తి చేసి 2027లో రిలీజ్ చేయడానికి బన్నీ ప్లాన్ చేస్తున్నాడు.

Exit mobile version