తమిళంలో డబ్ కానున్న ‘రన్ రాజా రన్’.?

run_raja_run_review
యంగ్ హీరో శర్వానంద్ కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచిన సినిమా ‘రన్ రాజా రన్’. ఈ సినిమా కోసం శర్వానంద్ తన లుక్ ని పూర్తిగా మార్చుకొని లవర్ బాయ్ లుక్ లో కనిపించడమే కాకుండా ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్ర చేసాడు. ఈ సినిమాతో శర్వానంద్ కి తెలుగులో మరింత గుర్తింపు వచ్చింది. ‘మిర్చి’ సినిమా అందించిన వంశీకృష్ణ రెడ్డి – ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మించిన ఈ సినిమా ద్వారా సుజీత్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.

తాజా సమాచారం ప్రకారం తమిళంలో కూడా శర్వానంద్ కి మంచి మార్కెట్ ఉండడం వల్ల ఈ హిట్ సినిమాని తమిళంలో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. ఇదే విషయాన్నీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శర్వానంద్ కూడా తెలిపాడు. మరి ఈ సినిమాని ఎవరు తమిళంలో డబ్ చేస్తారనే అధికారిక ప్రకటన కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.. శర్వానంద్, సీరత్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version