టాక్ ఎలాఉన్నా సాహో వసూళ్లు కుమ్మేస్తుంది.కొన్ని ఏరియాలలో మొదటి రోజుకి మించి రెండవ రోజు వసూళ్లు పెరగడం చెప్పుకోదగ్గ విషయం.ముఖ్యంగా బాలీవుడ్ లో హిందీ వర్షన్ తెలుగుకి మించి ఆదరణ దక్కించుకోవడం గమనార్హం.
బాలీవుడ్ క్రిటిక్స్ మీడియా సాహో కి దారుణమైన రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. సౌత్ సినిమాల ప్రాభల్యాన్ని తట్టుకోలేని బాలీవుడ్ మీడియా మరియు క్రిటిక్స్, మొదటి షో నుండే సాహో పై విమర్శల దాడికి దిగాయి. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ ఏకంగా భరించలేని సినిమా, వేస్ట్ మెటీరియల్ అంటూ కేవలం ఒకటిన్నర రేటింగ్ ఇచ్చారు.సాహో కి వచ్చిన టాక్ అక్కడ చాలా మందిని ఆనందంలో ముంచింది.
చూస్తుంటే వారి ఆనందం నిలబడేలా కనిపించడం లేదు.పూర్తి నెగెటివ్ రివ్యూ తో మొదలైన సాహో రోజురోజుకి ఆదరణ పెంచుకుంటూ పోతుంది.మొదటి రోజు 24.4 కోట్ల వసూళ్లు సాధించిన సాహో రెండవ రోజైన శనివారం మొదటి రోజుకి మించి 25.2కోట్ల వసూళ్లు రాబట్టడం గమనార్హం. ఇక మూడవ రోజైన ఆదివారం కూడా దాదాపు 30కోట్ల(అంచనా) వసూళ్ల వరకు సాధించినట్లు తెలుస్తుంది.
ఇదే ఊపు కొనసాగితే మరో రెండు రోజులలో ఒక్క హిందీ వర్షన్ మాత్రమే వంద కోట్ల మార్కుని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.