సాహో మూవీ ప్రభాస్ కి మిశ్రమ ఫలితం అందించింది. నార్త్ ఇండియాలో బంపర్ హిట్ గా నిలిచిన సాహో సొంత గడ్డపై చతికిల పడింది. ఓవర్ ఆల్ గా సాహో మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. అన్ని భాషలో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 400కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించిన సాహో 2019గాను అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దేశవ్యాప్తంగా సాహో అధిక వసూళ్లతో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ నమోదు చేసింది.
దాదాపు 290కోట్ల వరకు థియరిటికల్ రైట్స్ బిజినెస్ చేసిన సాహో టోటల్ రన్ లో 235కోట్ల షేర్ వరకు రాబట్టడంతో అమ్మినదానిలో 80%పైగా రికవర్ చేసింది. హిందీ వర్షన్ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అధిక లాభాలు ఆర్జించగా, తమిళ, మలయాళ డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద మొత్తంలో నష్టాలను చవిచూశారు. ఏది ఏమైనా బాహుబలితో ఇండియాలో ఏ సినీ పరిశ్రమ అందుకోలేని వసూళ్ల రికార్డుని సెట్ చేసిన ప్రభాస్ సాహో చిత్రంతో మరికొన్ని రికార్డు లు తన పేరిట నమోదు చేసుకున్నాడు. నెగెటివ్ టాక్ తోనే ఇలాంటి వసూళ్లు సాధించిన ప్రభాస్, పాజిటివ్ టాక్ వచ్చినట్లైతే మరి ఏ రేంజ్ లో కలెక్షన్స్ ఉండేవో మరి.
