ఇటీవలే ‘జయ జానకి నాయక’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాతి సినిమా ‘సాక్ష్యం’. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రకృతిలోని పంచభూతాలు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందట. అందుకే ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి కొంత ఎక్కువగానే ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా యొక్క చివరి దశ షూటింగ్ యూఎస్‌లో జరుగుతోంది.
దీంతో చిత్ర యూనిట్ ప్రేక్షకుల కోసం టీజర్ ను సిద్ధం చేసింది. ఈ నెల 18న ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసేలా ఉంటుందని దర్శకుడు శ్రీవాస్ అంటున్నారు. జూన్ 14న విడుదలకానున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా నటిస్తుండగా శరత్ కుమార్, జగపతిబాబు, వెన్నెల కిశోర్ లు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
