ప్రముఖ పెయింటింగ్స్ మరియు సర్వీసెస్ సంస్థ టెక్నోపెయింట్స్ తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్‌ను నియమించింది. తమ వ్యాపార విస్తరణలో భాగంగా, టెక్నోపెయింట్స్ ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో కార్యకలాపాలను, విక్రయాలను విస్తరిస్తోంది. రిటైల్ రంగంలో కొత్త భాగస్వాములతో కలిసి అన్ని రాష్ట్రాలలో ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విస్తరణలో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు, కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు సచిన్‌ను ఎంచుకున్నారు. గురువారం నాడు ముంబైలో రెండు ప్రచార చిత్రాలను చిత్రీకరించారు. ఇటీవల ‘ఓజీ’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యువ దర్శకుడు సుజిత్ ఈ రెండు యాడ్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహించారు. ఈ ప్రచార చిత్రాలను అతి త్వరలోనే దేశంలోని అన్ని ప్రముఖ మాధ్యమాల ద్వారా విడుదల చేయనున్నట్లు కంపెనీ ఛైర్మన్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు.
