పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ ‘ఓజి 2’ సినిమా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే, సుజిత్ నానితో ‘బ్లడీ రోమియో’ సినిమా చేయాల్సి ఉంది.. కానీ, ‘ది ప్యారడైజ్’ ఆలస్యం కావడంతో నాని అందుబాటులోకి రాలేదు. దీంతో సుజిత్ దృష్టి ‘ఓజి-2’ వైపు వెళ్ళింది. ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటించారు, పైగా స్క్రిప్ట్ కూడా చివరి దశలో ఉంది. దీంతో, చివరికి ‘బ్లడీ రోమియో’ను తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి వచ్చింది.
ఇక ‘ఓజీ 2’ పూర్తిగా పూర్తయ్యే వరకు ‘బ్లడీ రోమియో’ ముందుకు సాగదు. ఇది కచ్చితంగా నాని అభిమానులను నిరాశపరిచే వార్తే. ఎలాగూ సుజీత్ తన పూర్తి దృష్టిని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాపైనే పెట్టారు, పవన్ కి ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల.. ఈ సినిమా స్లోగా సాగుతుంది. అంటే.. ఈ ఏడాది మొత్తం సుజీత్ ఓజి 2 పైనే ఉంటారు. ఆ రకంగా వచ్చే ఏడాది మాత్రమే నానితో సినిమా ఉండే అవకాశం ఉంది. మరోవైపు నాని తర్వాత ప్రాజెక్ట్ పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
