సమీక్ష : సఃకుటుంబానాం – అక్కడక్కడా మెప్పించే ఫ్యామిలీ డ్రామా

Sahakutumbaanaam

విడుదల తేదీ : జనవరి 01, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : రామ్ కిరణ్, మేఘా ఆకాష్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య తదితరులు
దర్శకుడు : ఉదయ్ శర్మ
నిర్మాతలు : హెచ్ మహాదేవ్ గౌడ్ & హెచ్ నాగరత్న
సంగీత దర్శకుడు : మణి శర్మ
సినిమాటోగ్రాఫర్ : మధు దాసరి
ఎడిటర్ : శశాంక్ మాలి, శివ శర్వాణి

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘సఃకుటుంబానాం’ (Sahakutumbaanaam) టీజర్, ట్రైలర్స్‌తో ప్రేక్షకుల్లో ఒకింత బజ్ క్రియేట్ చేసింది. ఉదయ్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం న్యూ ఇయర్ కానుకగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కళ్యాణ్ (రామ్ కిరణ్) ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని గడుపుతుంటాడు. అదే కంపెనీలో చేరిన సిరి(మేఘా ఆకాష్) తనకు అలాంటి ఫ్యామిలీ ఉండాలనే కోరికతో కళ్యాణ్‌ను ప్రేమిస్తుంది. కట్ చేస్తే.. కళ్యాణ్, అతని కుటుంబానికి సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటుంది సిరి. ఆ తర్వాత కళ్యాణ్‌తో సిరి ప్రేమ ఏమైంది..? అసలు కళ్యాణ్ వెనకాల ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి..? అతని కుటుంబ సభ్యులు ఎలాంటి వారు..? చివరకి ఏం జరిగింది..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఓ చక్కటి ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకులకు అందించాలని దర్శకుడు ఉదయ్ శర్మ చేసిన ప్రయత్నం బాగుంది. దీని కోసం ఆయన ఎంచుకున్న కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక డెబ్యూ హీరో అయినా తన పర్ఫార్మెన్స్‌తో రామ్ కిరణ్ మెప్పిస్తాడు. యాక్షన్, ఎమోషన్స్‌తో ఆయన ఆకట్టుకుంటాడు.

మేఘా ఆకాష్ కూడా చాలా మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ విలువలను ఇష్టపడే అమ్మాయిగా ఆమె చేసిన పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఇక హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా తనదైన పర్ఫార్మెన్స్‌తో కథకు బలం చేకూరుస్తారు. సత్య కూడా తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటాడు.

కథలోని ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. సాంగ్స్ పరంగా కూడా ఒకట్రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలకు కథలో బలం ఉండేలా చూసుకోవాలి. కథలో కొత్తదనం లేకపోవడం ముఖ్యంగా ఫస్టాఫ్ సాగే తీరు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోదు. చాలా రొటీన్ కథతో సాగే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు బోర్ కొటిస్తుంది.

ఇక స్లో గా సీన్స్, పాటలు కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడం మైనస్. ఫస్టాఫ్‌తో పోలిస్తే, సెకండాఫ్ కాస్త ఎంగేజింగ్‌గా మలచాలని ప్రయత్నించారు. కానీ, అందులోనూ స్లోగా సాగే సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ఇక హీరోకు చెప్పిన డబ్బింగ్ వాయిస్ ఏమాత్రం సూట్ కాలేదని ప్రేక్షకులు ఫీల్ అవుతారు.

ఫ్యామిలీ డ్రామాకు సరికొత్త పాయింట్‌ను జోడించాలనే ప్రయత్నం బాగున్నా, దాన్ని ఎంగేజింగ్‌గా ఎగ్జిక్యూట్ చేయడంలో చిత్ర యూనిట్ ఫెయిల్ అయ్యింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఉదయ్ శర్మ తీసుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. కేవలం ఫ్యామిలీ డ్రామా ఎలిమెంట్స్, కొన్ని కామెడీ సీన్స్‌తో కథను ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం వృథా అయింది. రొటీన్ ట్రీట్మెంట్‌తో సాగే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్‌గా నిలిచింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. చాలా సీన్స్ స్లోగా సాగడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. మణిశర్మ సంగీతంలో ఒకట్రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి. బీజీఎం కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా.. ‘సఃకుటుంబానాం’ (Sahakutumbaanaam) చిత్రం ఫ్యామిలీ డ్రామా అంశాలతో వచ్చినప్పటికీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. హీరోహీరోయిన్ల పర్ఫార్మెన్స్, కొంతవరకు నవ్వించే కామెడీ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. రొటీన్ ట్రీట్మెంట్‌తో సాగే స్క్రీన్ ప్లే, బోరింగ్ సీన్స్, స్లో పేస్ ఈ సినిమాకు మైనస్. ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడేవారిని ఈ సినిమా పూర్తిగా మెప్పించకపోవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Exit mobile version