
దిలీప్ కుమార్, ప్రియాల్ గోర్ జంటగా ఇండో ఇంగ్లిష్ ప్రొడక్షన్స్ పతాకంపై కొల్లా నాగేశ్వరరావు నిర్మించిన సినిమా ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. ఈ సినిమా ద్వారా ప్రముఖ హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ కుమార్తె శశి కిరణ్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ బోర్డు నుండి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ పొందింది.
మలయాళ సినిమా ‘తట్టత్తిన్ మరియత్తు’కి రీమేక్ అయినా తెలుగుదనం ఉట్టిపడేలా తెరకెక్కించాం. ఈ నెల 13న సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. ఎమ్మెస్ నారాయణ కూతురు కావడం వలనే దర్శకురాలి అవకాశం వచ్చింది. ఈ సినిమా విడుదల తర్వాత నాకంటూ ఒక గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. ఎవ్వరినీ నిరాశ పరిచే సినిమా కాదు అని శశి కిరణ్ వ్యాఖ్యానించారు.