‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘రేయ్’ సినిమాల తర్వాత మెగా ఫ్యామిలీ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. మాస్ ఆడియన్స్ ని మెప్పించే హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెజీన కసాండ్ర రెండవ సారి సాయి ధరమ్ తేజ్ సరసన జోడీ కడుతోంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాని ముందుగా ఆగష్టు చివర్లో రిలీజ్ చెయ్యాలనుకున్నా తాజాగా సెప్టెంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసారు.
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చిరు బర్త్ డే కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నాడు. అదే చిరు పుట్టినరోజు అనగా ఆగష్టు 22న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ మూవీ ఆడియోని లాంచ్ చేయనున్నారు. అమెరికాలో ఓ మేజర్ పార్ట్ ని షూటింగ్ చేసారు. ఆ ఎపిసోడ్ ఈ మూవీకి కూడా హైలైట్ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో ఆద శర్మ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. పూర్తి కమర్షియల్ హంగులతో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
