డిసెంబర్ 25న రానున్న సాయి కొర్రపాటి ‘తుంగభధ్ర’

tungabhadra
ఎక్కువగా స్టార్స్ కంటే కథను నమ్మి వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకునట్టున్న నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం. ఈ బ్యానర్ అధినేత అయిన సాయి కొర్రపాటి కొత్త దర్శకులను, కొత్త నటీనటులను ఎంకరేజ్ చేస్తూ చేస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయాలను అందుకుంటుంది. ఈ సంవత్సరలో ఇప్పటికే ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సాయి కొర్రపాటి తన బ్యానర్ నుంచి మరో సినిమాని ఈ సంవత్సరం రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సాయి కొర్రపాటి శ్రీనివాస్ కృష్ణ గోగినేనిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేస్తున్న సినిమా ‘తుంగభద్ర’. ఈ సినిమాని డిసెంబర్ 25న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీ ద్వారా అదిత్ హీరోగా పరిచయం అవుతుంటే డింపుల్ చోపడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళ యాక్టర్ సత్యరాజ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి హరి గౌర మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version