మెగా మేనల్లుడుగా టాలీవుడ్ కు పరిచయం అయ్యి తనకంటూ మంచి మార్కెట్ ను ఏర్పర్చుకున్నాడు యువ హీరో సాయి ధరమ్ తేజ్. అయితే తన కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు వరుస హిట్స్ అందుకొని సరైన బాటలో నడుస్తున్నాడు అనుకునే సమయంలోనే కొన్ని సినిమాలతో అపజయాలను ఎదుర్కొన్నాడు. కానీ మళ్ళీ “చిత్ర లహరి”, “ప్రతీరోజూ పండగే” సినిమాలతో మళ్ళీ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
వాటి తర్వాత హ్యాట్రిక్ కొట్టాలనే అనుకున్నాడో ఏమో కానీ “సోలో బ్రతుకే సో బెటర్”తో కొట్టేలా ఉన్నాడనే చెప్పాలి. లేటెస్ట్ గా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ మోస్ట్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది మరి. సింగిల్ లైఫ్ బెటర్ అనుకునే యువకుడి రోల్ లో సాయి తేజ్ మంచి ఎంటర్టైన్మెంట్ నే అందించేలా ఉన్నాడు. ఇక అలాగే తన లాస్ట్ సినిమాలో సీనియర్ నటుడు రావు రమేష్ తో ఎలాంటి ఫన్ జెనరేట్ అయ్యిందో మనం చూసాము ఈసారి కూడా వీరి కాంబో నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ పక్కా అనిపిస్తుంది.
ముఖ్యంగా ట్రైలర్ లో వీరి మధ్య సినిమా థియేటర్ డైలాగ్ దగ్గర ప్రతీ ఒక్కరికీ మంచి ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఇక అలాగే నభా నటేష్ కూడా మంచి రోల్ లో కనిపిస్తుంది. వీరిద్దరి నడుమ కూడా మంచి ఫన్నీ ఎపిసోడ్స్ నే ఇందులో చూపించారు. ఇక అలాగే ఆర్ నారాయణ మూర్తిని ప్రేరణాగ తీసుకొని సింగిల్ గా ఉండిపోవాలి అనుకునే ఈ కుర్రాడికి ఆయన ఇంటర్వ్యూలో పెళ్లి కోసం చెప్పే ఎపిసోడ్ ఇలా చాలానే వాటితో ట్రైలర్ మాత్రం మోస్ట్ హిలేరియస్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది.
మొత్తానికి ఈ నూతన దర్శకుడు ఈ క్రిస్మస్ పండుగను ప్రేక్షకులకు మంచి ట్రీట్ నే ఇచ్చేందుకు రెడీ అయ్యాడని చెప్పాలి. ఇక అలాగే థమన్ సాంగ్స్ ఇప్పటికే హిట్ అయ్యాయి. అలాగే ఇందులో మంచి స్కోరింగ్ ను కూడా ఇచ్చాడు. అలాగే వెంకట్ సి దిలీప్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. వీటితో పాటుగా బి వి ఎస్ ఎం ప్రసాద్ గారి నిర్మాణ విలువలు ఈ ట్రైలర్ లో ఉన్నతంగా కనిపిస్తున్నాయి. మరి ఈ సోలో సాయి తేజ్ సందడి వచ్చే డిసెంబర్ 25 నుంచి ఎలా ఉంటుందో చూడాలి.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
