సాయి తేజ్ సినిమా ఇప్పుడు ఇలా కూడా అందుబాటులోకి వస్తుంది..!


సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా యంగ్ సెన్సేషన్ నభా నటేష్ హీరోయిన్ గా నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్” ఓ సాహసోపేత విడుదలలో వచ్చి ఆదరగొట్టింది అని చెప్పాలి. ఓటిటి హవా నడుస్తున్న ఈ సమయంలో అందుకు బ్రేక్ ఇచ్చి థియేటర్స్ లోకి వచ్చి పీపుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.

అయితే ఈ చిత్రం విడుదలకు ముందే స్ట్రీమింగ్ హక్కులను “జీ” వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని వారు స్ట్రీమింగ్ వెర్షన్ కు కూడా తీసుకు రావడానికి రెడి చేస్తున్నారు. వచ్చే కొత్త సంవత్సరం 2021 జనవరి 1వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని “జీ ప్లెక్స్” లో పే పర్ వ్యూ రూపేణా అందుబాటులోకి తీసుకు రానుండడం కన్ఫర్మ్ అయ్యింది.

ఇప్పటికే థియేట్రికల్ వెర్షన్ లో బ్రేకీవెన్ కు దగ్గరలో ఉన్న ఈ చిత్రం ఇక డిజిటల్ గా కూడా అందుబాటులోకి రానుంది. మరి ఇందులో ఎలాంటి రెస్పాన్స్ ను ఈ చిత్రం అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహించారు.

Exit mobile version