కామెడీని పండిస్తున్న మెగా హీరో ‘సుప్రీమ్’

sai-darm-teja
ఇటీవలే వచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేసిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. అవే ‘తిక్క’ మరియు ‘సుప్రీమ్’. ఇప్పటికే తిక్క కోసం రెండు షెడ్యూల్స్ ఫినిష్ చేసిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సుప్రీమ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న సుప్రీమ్ సినిమాకి పటాస్ తో తొలి హిట్ ని అందుకున్న అనిల్ రావిపూడి డైరెక్టర్. అనిల్ ప్రస్తుతం సాయి ధరమ్ – రాశీ ఖన్నా – వెన్నల కిషోర్ లపై వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. సుప్రీమ్ సినిమాలో వెన్నెల కిషోర్ తన రియల్ లైఫ్ పేరుతోనే హీరోయిన్ కింద పనిచేసే ఓ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు. వీరి ముగ్గురు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా సరదాగా ఉంటాయని ఈ చిత్ర టీం అంటోంది. సాయి ధరమ్ తేజ్ ఓ టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలతో హిట్స్ అందుకున్న దిల్ రాజు – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్నా ఈ సుప్రీమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ గా నిలుస్తుందని ఈ చిత్ర టీం అంటోంది.

Exit mobile version