సాయిధరమ్ తేజ్ – దిల్ రాజు మూవీ డీటైల్స్

సాయిధరమ్ తేజ్ – దిల్ రాజు మూవీ డీటైల్స్

Published on Jul 29, 2015 11:43 AM IST

saidharam-tej-ani-ravidpudi

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. ఇది కాకుండా సాయిధరమ్ తేజ్ తన తదుపరి సినిమాని కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవర్ఫుల్ పోలీస్ స్టొరీ ‘పటాస్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకి డైరెక్టర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాని సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నామని ఈ చిత్ర టీం అనౌన్స్ చేసింది.

స్క్రిప్ట్ వర్క్ మొత్తం పర్ఫెక్ట్ గా రెడీ చేస్కొని కంటిన్యూగా షూట్ చేయడం కోసం ఈ చిత్ర టీం ఒక నెల గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్ లో సాయిధరమ్ తేజ్ కూడా తన లుక్ ని మార్చుకోనున్నాడు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కి జోడీగా అందాల భామ రాశి ఖన్నాని సెలక్ట్ చేసారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మాతగా సాయిధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ఇది. సాయిధరమ్ తేజ్ కి మొదటి హిట్ అయిన ‘పిల్లానువ్వులేని జీవితం’ సినిమాని దిల్ రాజునే నిర్మించాడు. ఇది కాకుండా సాయిధరమ్ తేజ్ సునీల్ రెడ్డి డైరెక్షన్ లో కూడా ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు