మరో బాబుకు జన్మనిచ్చిన సైఫ్ – కరీనా జంట.!

saif and kareena

అన్ని సినీ ఇండస్ట్రీలలో కూడా కొన్ని స్టార్ కపుల్స్ ఉన్న సంగతి తెలిసిందే. అలా బాలీవుడ్ లో కూడా కొన్ని చూడచక్కని జంటలు ఉన్నాయి. మరి వాటిలో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ అలాగే కరీనా కపూర్ ల జంట కూడా ఒకటి. అయితే వీరి జంట ఇప్పుడు మరో పండంటి మెగా బిడ్డకు జన్మనిచ్చింది. ఈరోజు ఫిబ్రవరి 21 ఉదయం ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో తమ రెండో మెగా బిడ్డకు ఆహ్వానం పలికారు.

మరి ఇదిలా ఉండగా వీరికి 2016లో వీరికి మొదటి సంతానంగా తైమూర్ అలీ ఖాన్ జన్మించాడు. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత రెండో బిడ్డకు వీరు జన్మనిచ్చారు. మరి ఈ వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి వీరిద్దరికీ తమ ఫాలోవర్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండడంతో పాటుగా వారి ఆశీర్వాదాలను కూడా ఆ బిడ్డకు తెలియజేస్తున్నారు. మరి ప్రస్తుతం సైఫ్ ప్రభాస్ తో “ఆదిపురుష్” అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version