ప్రస్తుతం విడుదలకి రాబోతున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన సినిమా “పెద్ది” హాట్ టాపిక్ గా మారింది. అయితే పెద్ద సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ యూఎస్ మార్కెట్ లో సాలిడ్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
అయితే ఇదే పెద్ది చిత్రంతో కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సలార్, కేజియఫ్ హోంబళే సంస్థ వారు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ లోకి దిగారు. ఓవర్సీస్ మార్కెట్ లో హోంబళే ఓవర్సీస్ పేరిట కొత్త సంస్థ స్టార్ట్ చేసి ఇక నుంచి ఓవర్సీస్ మార్కెట్ లో కూడా తమ పాగా వేసేందుకు సిద్ధం అయ్యారు. అలా పెద్ది చిత్రాన్ని ఓవర్సీస్ మార్కెట్ లో తమ మొదటి సినిమాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు బిగ్ అప్డేట్ అందించారు. అందుకు తాము కూడా ఎంతో గర్విస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు.
Stories rooted in our soil.
Emotions meant for the world 🌍✨Proud to begin our Overseas Distribution journey with #PEDDI ❤️🔥
Taking Indian stories beyond borders and bringing them closer to audiences worldwide.Excited to bring the world of #PEDDI to cinemas this JUNE… pic.twitter.com/Hc4cglX5Gr
— Hombale Overseas (@HombaleOverseas) May 14, 2026
