ఇటీవల హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన పలు తక్కువ బడ్జెట్ చిత్రాల్లో ‘అబ్సెషన్’ అలాగే ‘బ్యాక్ రూమ్స్’ చిత్రాల కోసం సినిమా లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాక్సాఫీస్ దగ్గర భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాలను అందించిన బ్లమ్ హౌస్, అటామిక్ మాన్స్టర్ సంస్థల బ్యానర్ వారు ఇప్పుడు మరో క్రేజీ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధం అయ్యారు.
సోనీ పిక్చర్స్ వారి సమర్పణలో ఇండియన్ మార్కెట్ లో తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో చేస్తున్న ఆ సినిమానే ‘ఇన్ సైడియోస్’. హారర్ సినిమాల అభిమానులకి ఫీస్ట్ ఇచ్చే విధంగా క్రేజీ పోస్టర్స్ ని ఇపుడు విడుదల చేసి అబ్సెషన్, బ్యాక్ రూమ్స్ లాంటి సినిమాలు అందించిన బ్యానర్ వారు సగర్వంగా తీసుకొస్తున్నారు అని ప్రకటించారు.
దీనితో ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని ఈ ఆగస్ట్ లోనే విడుదల చేస్తున్నట్టు డేట్ 21గా లాక్ చేశారు. మరి ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేస్తుందో చూడాలి. ఆ రెండు సినిమాలూ తెలుగులోనే కాకుండా ఇతర డబ్బింగ్ వెర్షన్ లలో రాలేదు. సో ఈ సినిమాకి అడ్వాంటేజ్ ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
They’re coming for our world.
Watch the final trailer TOMORROW – #Insidious: Out Of The Further is exclusively in cinemas August 21. pic.twitter.com/47TQ0yfWJj
— Sony Pictures India (@SonyPicsIndia) August 4, 2026
