ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా “సలార్” అనే భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రాధే శ్యామ్ చిత్రం పూర్తయ్యాక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ చిత్రాన్ని మొదలు పెట్టేసి పైగా ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసేసారు. అయితే మళ్ళీ ఈ మధ్యలోనే ఈ సినిమా డైరెక్ట్ సినిమానా లేక రీమేక్ చిత్రమా అన్న అంశం కూడా హైలైట్ అయ్యింది.
అయితే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అనౌన్సమెంటే విపరీతమైన హైప్ తో వచ్చింది. అలాగే ఆ కొద్ది గ్యాప్ లోనే నూతన నటీనటులకు ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం కలిపిస్తున్నామని హైదరాబాద్ మరియు చెన్నై ప్రాంతాల్లో ఆడిషన్స్ ను పెట్టారు. మరి ఆ ఆడిషన్స్ నుంచి ఏకంగా 100 మంది కొత్త నటులను ఈ చిత్రం కోసం సెలెక్ట్ చేశారట. మరి వీరందరికీ కలిపి ఒకే సన్నివేశం ఉంటుందా సినిమాలో ఎలా సెట్ చేస్తారో అన్నది తెలియాల్సి ఉంది.
