హైదరాబాద్ లో సందడి చేయనున్న బాలీవుడ్ తారలు.

salman-khan
నవంబర్ 18న అతిరధ మహారధులు, ప్రముఖ బాలీవుడ్ తారలు నిజాం నావాబుల గడ్డ, హైదరాబాద్ లో సందడి చేయనున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ చెల్లెలు వివాహం కొరకు హైదరాబాద్ వస్తున్నారు. ఎక్కువగా సంపన్నులు తమ వివాహా వేడుకలకు జైపూర్ ను వేదిక చేసుకుంటే, సల్మాన్ మాత్రం హైదరాబాద్ లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ ను ఎంపిక చేసుకున్నారు.

తన సోదరి వివాహా వేడుక కోసం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ మొత్తాన్ని రెండు రోజుల పాటు ఈ నెల 17, 18వ తేదీలలో సల్మాన్ బుక్ చేశాడు. ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. సల్మాన్ సోదరి అర్పిత్ ఖాన్.. తన చిరకాల స్నేహితుడు, ప్రియుడు ఆయుష్ శర్మను వివాహం చేసుకోబోతుంది. ఈ వివాహ వేడుకకు కేవలం 300 మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. ఆహ్వానితుల జాబితాలో సినిమా, రాజకీయ ప్రముఖులు ఉన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నాగార్జున, వెంకటేష్ లను ఆహ్వానించారు. షారుఖ్ కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. అతిధుల కోసం నిజాం వంటకాలను సిద్దం చేస్తున్నారు.

Exit mobile version