నేడు సల్మాన్ తాను నటించనున్న కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. 2021లో రంజాన్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. సాజిద్ నడియావాలా నిర్మాతగా మరియు కథా రచయితగా ఫర్హాద్ సాంజీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈచిత్రానికి కభీ ఈద్ కబీ దివాలి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నేడు అధికారికంగా ఈ చిత్ర ప్రకటన చేశారు.ఫర్హాద్ సాంజీ దర్శకత్వంలో వచ్చిన హౌస్ ఫుల్ 4 ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ఈ చిత్రం రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇక సల్మాన్ గత ఏడాది రెండు చిత్రాలు విడుదల చేశారు. భారత్ అలాగే దబంగ్ 3 చిత్రాలు బాక్సాపీస్ వద్ద ఓ మోస్తరు విజయాలు నమోదు చేసుకున్నాయి. దబంగ్ 3 చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఇక అదే దర్శకుడితో సల్మాన్ రాధే అనే మరో చిత్రాన్ని తీస్తున్నారు. 2020 ఈద్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రతి ఏటా రంజాన్ కి ఓ చిత్రం విడుదల చేసే అలవాటున్న సల్మాన్ 2021 రంజాన్ కి కభీ ఈద్ కభీ దివాలి సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలోని మిగతా నటులు , సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.
BIGGG NEWS… #SalmanKhan and #SajidNadiadwala join hands for their next project… Titled #KabhiEidKabhiDiwali… Directed by Farhad Samji… Story and produced by Sajid Nadiadwala… #Eid2021.
— taran adarsh (@taran_adarsh) January 10, 2020
