బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఇప్పుడు మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా దిల్ రాజు బ్యానర్ లో ఈ మధ్యనే సినిమా అట్టహాసంగా లాంచ్ అయ్యింది. అయితే ఈ సినిమాతో సల్మాన్ సరైన కం బ్యాక్ బ్లాక్ బస్టర్ కొట్టాలని అంతా ఎదురు చూస్తున్నారు.
మెయిన్ గా అభిమానులు తన బాక్సాఫీస్ బ్లాస్ట్ ని బాగా మిస్ అవుతున్నారు. ఇక లేటెస్ట్ గా వారి కోసం సల్మాన్ ఉత్సాహంగా తన బ్లాక్ బస్టర్ సీజన్ 2027 ఈద్ లో ఈ సినిమా రాబోతుంది అని ప్రామిస్ చేశారు. అంతే కాకుండా సమయం వచ్చినపుడు తానే ఈ సినిమా తాలూకా అప్డేట్స్ అందిస్తాను అని సో నేను ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నానో మీరు కూడా అలానే ఎదురు చూడాలి అంటూ అభిమానులకి సూచించారు.
ఇక ఫైనల్ గా ప్రస్తుతం మీ మనసులో ఎంత ఉత్సాహం, ఆత్రుత ఉన్నాయో.. నాలో కూడా అవే ఉన్నాయి హాహా అంటూ చాలా కాన్ఫిడెంట్ గా సల్మాన్ చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో తాను ఎంత నమ్మకంగా ఉన్నారో అనేది అర్ధం అవుతుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా తనకి సాలిడ్ కంబ్యాక్ అవుతుందో లేదో చూడాల్సిందే.
Thoda durr ki sochna chahiye, That’s why announced Eid….. Don’t worry iss wali ka bhi bataenge, when the time is right……
Patience, thoda sa sabar……
Mere Jitna he intezar karna padega,
Baherhaal jo apka haal hai wo hi mera bhi haal hai…. haha 🙏#Nayanthara… pic.twitter.com/nMGrfOj3DF— Salman Khan (@BeingSalmanKhan) April 24, 2026
