బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఆయన టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాడట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ 2026లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషనల్ కోర్ ఉన్న ఈ కథలో సల్మాన్ ఖాన్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు.
ఈ సినిమాతో పాటు రాజ్ & డికె దర్శకత్వంలో కూడా సల్మాన్ ఒక విభిన్నమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఆయన ఒక ‘రిటైరింగ్ సూపర్ హీరో’గా కనిపించబోతున్నారనే వార్త ఫ్యాన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతోంది. నవంబర్ 2026 నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం సల్మాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో రాబోయే చిత్రంలో సల్మాన్ సరసన నటించేందుకు ఒక టాప్ హీరోయిన్ కోసం వెతుకులాట జరుగుతోంది. హిందీ, సౌత్ భాషలకు చెందిన భారీ తారాగణం ఈ సినిమాలో భాగం కాబోతున్నారు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ, సల్మాన్ కెరీర్‌లోనే ఒక భారీ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి.
