బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాతృభూమి’ సెన్సార్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులన్నింటినీ చిత్ర యూనిట్ పూర్తి చేసినప్పటికీ, సినిమాకు ఇంకా క్లియరెన్స్ లభించకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
2020 గాల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో అత్యంత సెన్సిటివ్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తెరకెక్కడం వల్లనే సెన్సార్ బోర్డు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అపూర్వ లఖియా దర్శకత్వంలో చిత్రాంగద సింగ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఏప్రిల్ నుండి ఆగస్టుకు వాయిదా పడింది. ఇక తాజా జాప్యంతో ప్రమోషన్స్, డిస్ట్రిబ్యూషన్ ప్లాన్స్ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో మేకర్స్ ఆందోళన చెందుతున్నారు.
